నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులు వాటి ఖర్చుల వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో అనంతరావుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర బిజెపి కమిటీ పిలుపుమేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలకు అందించిన నిధులను, ఖర్చు చేసిన నిధులను, నూతనంగా పెన్షన్లకు పెట్టుకున్న దరఖాస్తుదారుల వివరాలను, ఇతర వివరాలను ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్, చిన్నోళ్ల శంకర్, బసవ రెడ్డి, గెరిగంటి నరసింహులు, రాజశేఖర్ రెడ్డి, తిరుమలేష్, సిద్దు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఆయా మోర్ఛల అధ్యక్షులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 06:13PM