నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ శైలజని సస్పెండ్ చేయాలని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల అధికారి ఎల్లయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవహేళన చేసి, దళిత విద్యార్థి సంఘ నాయకులను దూషించిన హెడ్మాస్టర్ శైలజ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీడీయస్ఎఫ్ ఉపాధ్యక్షులు నిమ్మ సురేష్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm