నవతెలంగాణ-భిక్కనూర్
18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రెడ్డిగారి రమేష్ రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలో బిజెపి నాయకులు టీములుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ధారించే యువత అర్హులైన వారు కచ్చితంగా ఓటు హక్కును నమోదు చేసుకునేలా పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ యూత్ నాయకుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm