- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
వృద్ధుల సంరక్షణయే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోనీ సాయిపేట గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద మంగళవారం ధర్మసాగర్ మండల రైతుబంధు సమితి కన్వీనర్ సోంపల్లి కరుణాకర్ తాత-నానమ్మ క్రీ.శే.సోంపేల్లి రామక్క, క్రీ.శే.సోంపేల్లి మల్లయ్య గార్ల జ్ఞాపకార్థం సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చేతుల మీద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోంపల్లి కరుణాకర్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమని కొనియాడారు. అనంతరం గ్రామంలో ఇటీవల మరణించిన క్రీ.శే.మేకల రోశయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు రూ.5000 /- ఆర్ధిక సహాయాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ మునిగేల రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్, నాయకులు మారగోని బిక్షపతి, మామిడి కుమార్, మాచర్ల సుదర్శన్, గాజుల సదానందం, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, గ్రామస్తులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 06:29PM