నవతెలంగాణ-గాంధారి
ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ రైతు దిక్ష ను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. స్థానిక గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రేపు 30.11.2022 నాడు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక
తహశీల్దార్ కార్యాలయం ముందు నియోజకవర్గంలోని రైతుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావునా దీక్షను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి అదే విధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల యొక్క పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించి అదేవిధంగా పార్ట్ బి లోని భూములకు సంబంధించిన రైతులకు శాశ్వత పట్టాలను ఇవ్వాలని ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రేపు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల ఎంపిటిసి కామెల్లి, బాలరాజ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, సీనియర్ నాయకులు మదర్, లైన్ రమేష్, వెంకట్ రాం రెడ్డి, వెంకట్ రెడ్డి, మిట్ట నాయక్, సుభాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 06:56PM