నవతెలంగాణ-నవీపేట్
మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చైతన్య సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి పద్మావతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఇచ్చిందని ప్రతి విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక అనేక విషయాలు పొందుపరచడం జరిగిందని ప్రతి పౌరుడు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ప్యానల్ న్యాయవాది పిల్లి శ్రీకాంత్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm