- భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-గాంధారి
మండల భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ గోవర్ధన్ కు మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు ఈకే ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువత ఎన్నో రోజులుగా తెలంగాణ వచ్చిన తర్వాత అయినా బ్రతుకులు మారుతాయి అనుకున్నారు. కానీ కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం బాధాకరం. తద్వారా యువత చిన్న చిన్న ప్రైవేటు కంపెనీలో గాని కూలి, నాలి చేసుకుంటూ నోటిఫికేషన్ల గురించి ఎదురుచూసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి కెసిఆర్ మీరు జారీ చేసిన నోటిఫికేషన్ల నియామకాలు వెంటనే జరపాలి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి మొత్తం 3,016×48=1,44,768 వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి జాప్యం చేయకుండా వాటి నియామకాలను వెంటనే జరపాలి అని గాంధారి మండల శాఖ భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రభాకర్ రావు పోతంకల్ సతీష్, గబ్బర్ సింగ్, నరేందర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 07:04PM