నవతెలంగాణ-ధర్మసాగర్
మహిళలు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖి వన్ స్టాప్ సిబ్బంది లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ స్కూల్లో మంగళవారం అంగన్వాడి సూపర్వైజర్, అంగన్వాడి టీచర్ల సమక్షంలో, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సఖీ వన్ స్టాప్ సిబ్బంది, లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, కేస్ వర్కర్ హరిత పాల్గొని మాట్లాడుతూ కౌన్సిలింగ్, వైద్య, పోలీస్ తాత్కాలిక వసతి, న్యాయ సహాయం ఐదు రకాల సేవల గురించి వివరంగా వివరించారు. సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు తెలుపుతూ గృహ హింస, లైంగిక వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, అత్యాచారాలు ఇలాంటి వాటి నుండి మహిళలు రక్షణ పొందడానికి సఖి సెంటర్ సిబ్బంది 24 గంటలు పనిచేస్తుందన్నారు. మహిళలు సమస్య ఉన్నప్పుడు 181 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం రక్షణ లభిస్తుందని చెప్పారు. ఆపదలో ఉన్నప్పుడు 08702452112 అనే నెంబర్ కి కాల్ చేయడం ద్వారా బాధిత మహిళలకు సత్వర సహాయం అందించ బడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, కేస్ వర్కర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 07:12PM