నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయిలో జాతీయ కుష్టు నివారణ సంస్థ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు మంగళవారం సందర్శించారు. డిసెంబర్ 6 నుండి ప్రారంభమవుతున్న ఇంటింటి గృహ సందర్శన జాతీయకృష్టు నివారణ సర్వే కార్యక్రమాన్ని ముందస్తు పరిశీలన నిమిత్తం జిల్లాను సందర్శించే సమయంలో మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయిని సందర్శించి కుష్టు వ్యాధి రోగులకు అందిస్తున్న సేవల పై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రుచితను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 6 నుండి ప్రారంభమయ్యే కుష్టు వ్యాధి సర్వేను కచ్చితంగా పగడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్, డిస్టిక్ అసిస్టెంట్ ఆఫీసర్ చందర్, పి హెచ్ ఎన్.ఎలిజిబెత్, ఆరోగ్య పర్యవేక్షణ అక్బర్ అలీ, ఉమారాణి, సీనియర్ అసిస్టెంట్ నీలాదేవి, ఆనంద్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm