- టీపీసీసీ సభ్యురాలు నాగమణి పిలుపు
నవతెలంగాణ-అశ్వారావుపేట
కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, డిసిసి అధ్యక్షులు శ్రీ పోదెం వీరయ్య ఆదేశాలతో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పై జరిగే ధర్నాను విజయవంతం చేయాలని టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి, నియోజక వర్గం నాయకులు మొగుళ్ళపు చెన్నకేశవరావులు ఆ పార్టీ శ్రేణులకు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ
ధరణి పోర్టల్ రద్దు చేయాలని, రైతు రుణమాఫీ చేయాలని, రైతు బీమా ప్రతి రైతుకు వర్తింపజేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు సాగుదారులపై అక్రమంగా బనా యించిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ రాజేష్ కుమార్ ను కలిసి ధర్నా విషయం అయి సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు, బూసి పాండు రంగా, దంజు నాయక్, బండారి మహేష్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 07:22PM