- టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ-డిచ్ పల్లి
విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలనెదే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవన నిర్మాణం పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్,ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నదని, నిరుపేద తల్లిదండ్రులకు ఎలాంటి భారం కాకూడదని ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే కేజీబీవీ పాఠశాలలన్నరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని , దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని, నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం ఘననియంగా పెరిగిందని వివరించారు. నూతనంగా నిర్మాణం అవుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం భవనంను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అస్పత్రిలో పల్స్ మిషన్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదస్, సర్పంచ్లు లోలం సత్యనారాయణ, నరేష్, ఎంపిటిసి చింతల దాస్, తహసిల్దార్ టివి రోజా, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, విడిసి చైర్మన్ దర్పల్లి ప్రభాకర్, పాశం కుమార్, అరటి రఘు, డాక్టర్ గంగా దాస్, బిరిష్ శెట్టి, క్రాంతి కుమార్, మండల ముఖ్య నాయకులు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యా మండలి ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 07:29PM