నవతెలంగాణ-కంటేశ్వర్
8వ జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్-2022 పోటీలు అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజారాం స్టేడియం, నాగారంలో, ఇంటర్ స్కూల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ పోటీలు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29, మంగళవారం జరిగాయని విజయ్ హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ ప్రభాదేవి బుధవారం తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలు పాల్గొనగా వయోపరిమితుల వారిగా నిర్వహించిన అథ్లెటికి పోటీలలో మా పాఠశాల విద్యార్థులు లాంగ్ జంప్ లో మధుశ్రీ (7వ తరగతి), ఎన్. ఎల్. ఎన్. రిన్విత్ (5వ తరగతి ) లు బంగారు పతకాలు, జి. (శ్రీవంత్ (9వ తరగతి) రజత పతకం, 300 మీటర్ల పరుగు పందెంలో నీరజ్ (5వ), మోక్ష్ (4వ తరగతి), 600 మీటర్ల పరుగు పందెంలో శ్రీ వైష్ణవి (6వ తరగతి ) లు షాట్పుట్లో మధుశ్రీ (7వ తరగతి) కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరచి బంగారు పతకాలు సాధించిన మధుశ్రీ, రిన్వితు డిసెంబర్ 5 మరియు 6 వ తేదీలలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హ్యాండ్ బాల్ బాలికల జట్టులో 10వ తరగతి చదివే శ్రీకృతి, ఆర్జిత, శ్రేష్ణ, యశస్వి, శరణ్య, శ్రీజ,, స్వప్నిక, విఘ్నత 8వ తరగతి చదివే సిరివేద పాల్గొని మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు, ట్రోఫి, ప్రశంసా పత్రాలు బహుమతిగా అందుకున్నారని కరస్పాండెంట్ ప్రభాదేవి తెలియజేశారు.వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల కార్యదర్శి డా. అమృతలత, కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, అకడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ పి.విజేత అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 04:04PM