నవతెలంగాణ-కంటేశ్వర్
జిల్లా వ్యాప్తంగా పలు ప్పాఠశాలలు, కళాశాలలు ప్రభూత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఎస్ బి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభూత్వ నిబంధనల ప్రకారం పదవ తరగతి వార్షిక పరీక్షల ఫీజు, స్పెషల్ టెక్స్ట్ పరీక్ష అని ఇతరత్రా ఫీజులని వసూలు చేస్తూ అసలు పరీక్ష ఫీజు 125 రూపాయలు ఉంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 500 నుండి 1500 వరకు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లి తండ్రుల శ్రమనే పెట్టుబడిగా చేసుకుంటున్నారు. కొన్ని కళాశాలలో 1700 నుంచి 2500వరకు ఫీజులను వసూలు చేసున్నారు అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు అజయ్, భరత్, సౌమ్య, హారిక తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm