నవతెలంగాణ-గోవిందరావుపేట
పేదవారు చలికి ఇబ్బంది పడకూడదని దుప్పట్లు కమ్మలు పంపిణీ చేస్తున్నట్లు విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్ సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని ముద్దులగూడెం గ్రామంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ చలి పెరుగుతున్నందున చలికి వణుకుతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 40 కుటుంబాలకు దుప్పట్లను జూట్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులకు 2023 క్యాలెండర్ ను అందజేస్తూ 200 మందికి దుప్పట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త దొంతి విజేందర్ రెడ్డి, సేవాలాల్ సేన ములుగు జిల్లా అధ్యక్షులు బాదావత్ రాజ్ కుమార్, గ్రామ యూత్ సభ్యులు శ్రీకాంత్, శ్రావణ్ కుమార్, గణేష్, తేజ, ఆనంద్, వంశీ, ప్రసాద్ లతోపాటుగా దాదాపు 200 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.