నవతెలంగాణ-కంటేశ్వర్
టేజిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎనిమిదవ జిల్లా అథ్లెటిక్ పోటీలలో అండర్ 8 విభాగంలో ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన మూడవ తరగతి విద్యార్థిని సహన సిల్వర్ మెడల్ సాధించినందుకు ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ మామిడాల మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించగా తమ పాఠశాల నుండి ప్రాతినిధ్యం వహించిన విద్యార్థులు మెడల్స్ ను సాధించడం అభినందనీయం అన్నారు. ఇదే విభాగంలో పాఠశాలకు చెందిన రెండవ తరగతి విద్యార్థిని అన్విత నాలుగో స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు గాను వారి తల్లిదండ్రులను పాఠశాలలో యాజమాన్యం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపి వెంకటేశ్వర్, ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేశ్వర్గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య పాఠశాల అధ్యాపక బృందం చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.