నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కో అపరేటివ్ సొసైటీ లి. మేస్ట్రీ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. మేస్ట్రీ సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నూతన ఎన్నికయిన సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధి కి పాటు పడాలి.గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కో అపరేటివ్ సొసైటీ లి. మేస్ట్రీ సంఘానికి అవసరమైన సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేణు, అరిఫ్ రామాంజనేయులు అడ్వొకేట్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ లు మల్లేష్ యాదవ్, బబ్ల్యూ ఖాన్, టిఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, ఫయాజ్, అమర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm