నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయం వద్ద పరిదిలోని దాచారం గ్రామ భూ నిర్వాసితులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుదవారం చెక్కులందజేశారు. దాచారంలోని 124 సర్వే నంబర్ యందు రైతుల నుండి పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం భూమి సేకరించింది. భూములందజేస్తున్న 20 మంది రైతులకు ప్రభుత్వం సుమారు 7.32 కోట్ల చెక్కులందజేసిందని మిగతా రైతులకు విడతల వారిగా చెక్కలందజేస్తుందని ఎమ్మెల్యే రసమయి తెలిపారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కడగండ్ల కవిత, ఏఎంసీ చైర్మన్ రాజయ్య, తహసిల్దార్ విజయ ప్రకాశ్ రావు, మండలాద్యక్షుడు మహిపాల్ రెడ్డి, సర్పంచులు ద్యావనపల్లి మంజుల, పెంటమీదీ శ్రీనివాస్, టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 04:43PM