నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర నాగారం గ్రామంలో శ్రీ ముయ్యాలమ్మ తల్లి ట్రైబల్ సహకార సంఘం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీనివాసరెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు రైతు బీమా రైతు బంధు రుణమాఫీ ఎరువులు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలను కేంద్రం అందించకపోయినప్పటికిని కొనసాగిస్తూ రైతులను ఆదుకుంటూ వ్యవసాయం దండగ కాదు పండగ అంటూ రైతాంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని తాము పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు చేరవేసి కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి దాదా సింగ్, సంఘం అధ్యక్షులు మడి.సాయిబాబు, డైరెక్టర్లు పాయం.నారాయణ, సెంటర్ ఇంచార్జిలు గొంది.రాజు, తాటి రాజు, యనక.సుమంతు, చేరుకుల సారయ్య, ఎట్టి మనోజు, పూసం.శ్రీకాంత్, ముద్దబోయిన మని, పూసం సాంబ లక్ష్మి, తాటి చంద్రయ్య, ముద్దబోయిన రవి(పెద్ద ), రైతులు పాల్గొన్నారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 04:47PM