నవతెలంగాణ-బెజ్జంకి
చట్టాలపై అందరూ అవగాహన కలిగియుండాలని నాయిభ్ తహాసిల్దార్ పార్థసారథి సూచించారు. బుధవారం మండల పరిదిలోని పోతారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఏర్పాటు చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగియుండాలని ఎస్ఐ నరేశ్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. సర్పంచ్ జెరిపోతుల రజిత, ఆర్ఐ రాజయ్య, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm