నవతెలంగాణ-డిచ్ పల్లి
నవంబర్ 4 నుండి 6 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జరిగిన అండర్-12 భారత సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలో జిల్లా క్రీడాకారులు క్యాదారి సంహిత (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం), దెయ్యాల లిఖిత ( సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి) లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి డిసెంబర్ 7నుండి 11 వరకు తైవాన్ దేశంలోని తిచుంగ్ నగరంలో జరగనున్న ప్రపంచ కప్ అండర్-12 సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శోభన్ బాబు, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి అభినందిస్తూ క్రీడాకారులుద్దేశించి మాట్లాడుతూ అతి చిన్న వయసులో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు భారత జట్టు తరఫున ఆడడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రపంచ సాఫ్ట్ బాల్ కప్ పోటీలలో బంగారు పథకం సాధించడానికి కృషి చేయాలని అన్నారు. గత నాలుగు సంవత్సరముల నుండి జిల్లా నుండి అయిదుగురు క్రీడాకారులు భారత జట్టు లో ప్రాతినిధ్యం వహించడం జిల్లాకు గర్వకారణమన్నారు.
రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి అభిషేక్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ బద్దం లింగారెడ్డి, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల సహకారంతో మరింత మంది క్రీడాకారులను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా ప్రోత్సహిస్తామన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సోప్పరి వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల స్పోర్ట్స్ ఆఫీసర్ రామ లక్ష్మయ్య, నోడల్ ఆఫీసర్ శేషు కుమారి, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, జిల్లా బేస్బాల్ సంఘం అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 04:54PM