నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని రేగులపల్లి గ్రామానికి చెందిన బండిపెల్లి రాజేశం ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా బుధవారం రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ మృతుని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm