- పైడాకుల అశోక్ టిపిసిసి కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గోవిందరావుపేట గ్రామానికి చెందిన ఎట్టం వెంకన్న గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వెంకన్న కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు కార్యకర్తలు అండగా ఉండి ఆదుకుంటారన్నారు.
మృతుని కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన అందించి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో గోవిందరావుపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రపురం వెంకటేశ్వరరావు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సర్పంచ్ లావణ్య లక్ష్మి జోగనాయక్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, జంపాల చంద్రశేఖర్, సింగపురం కృష్ణ, కొత్తపెల్లి నరేష్, దాసరి సాహిత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 04:58PM