నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులని హైదరాబాద్ ఆర్కిటెక్చర్ బృందం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఆర్ యు బి వద్ద సుందరీకరణ పనులని పరిశీలించారు. తిలక్ గార్డెన్ నవీకరిస్తున్నందున స్థలాన్ని సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఖిల్లా రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులని పరిశీలించారు. వర్ని రోడ్, దుబ్బా స్మశాన వాటికలని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చర్ వినోద్, మున్సిపల్ అధికారులు సాగర్,రషీద్, ఆర్ అండ్ బి అధికారులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm