నవతెలంగాణ-భిక్కనూర్
సహస్ర డిపాజిట్ పథకంపై అత్యధిక వడ్డీ అందించడం జరుగుతుందని మండలంలోని పెద్ద మల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (సహాకార కో-పరేటివ్ బ్యాంక్) బ్యాంక్ మేనేజర్ రవీందర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ సహస్ర డిపాజిట్ పథకం ప్రవేశపెట్టినట్లు ఈ పథకంలో భాగంగా 1000 రోజులు నగదును ఫీక్స్ డిపాజిట్ చేసినందుకుగాను మిగతా బ్యాంకుల కన్నా అత్యధికంగా 7.25%, సీనియర్ సిటిజన్ కి 7.75% వడ్డీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యా, గృహా, వాహన రుణాలు, స్వల్ప కాలిక దీర్ఘకాలిక రుణాలు అందించడం జరుగుతుందని, బంగారంపై గ్రామకు 3500 అందించడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు బ్యాంకును సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ పురాం రాకేష్, సిబ్బంది నవీన్, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:48PM