- ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలుపై నెల వారి సమీక్ష సమావేశం బుధవారం డిచ్ పల్లి మండలంలోని గోర్లు పల్లి పాఠశాలలో నిర్వహించారు. ఈ మధ్యలో రాష్ట్ర బృందం ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి ని ఆకస్మికంగా సందర్శించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరును ప్రత్యేకంగా పరిశీలించి అభినందించారు. దానిని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయులు రాజేందరగౌడ్, ఉపాద్యాయులు శ్రీలత, సుజాతలను మండల విద్యాశాఖ పక్షాన మండల విద్యాశాఖ అధికారి రాజ గంగారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి ఎం నరేందర్,కాంప్లెక్స్ ప్ధానోపాధ్యాయులు మనోహరస్వామి, ఉష శ్రీ తదితరులు పాల్గొన్నారు.