నవ తెలంగాణ-జఫర్ గడ్
భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిలభారత మహాసభలు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై డిసెంబర్ 13 నుండి 16 వరకు జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు యకన్న నాయక్, మండల కార్యదర్శి అర్జున్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో
మోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గోడ పత్రికలను, కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భాంగా మాట్లాడుతూ దేశంలోనే విద్యారంగ సమస్యల మీద రాజీలేని పోరాటాలు చేస్తూ, దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి సమాన విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు తెలంగాణలో జరగడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దేశం నుండి నలుమూల రాష్ట్రాల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, భవిష్యత్తు కర్తవ్యాలు, తీర్మానాలు చేసుకొని ఉద్యమా రూపకల్పన కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. మహాసభలు జయప్రదం చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపధ్యక్షులు తరుణ్ ,మండల కార్యదర్శి అర్జున్, నాయకులు స్వాతి ,హారిక,ప్రవలిక, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:56PM