నవతెలంగాణ-డిచ్ పల్లి
మైగ్రైంట్స్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం (ఎంఆర్ డబ్ల్యుఎఫ్) దుబాయ్ శాఖకు కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న జంగం బాలకిషన్ ను టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ లను బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామానికి చెందిన బాలకిషన్ గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ లో పని చేస్తూ అక్కడ గల్ఫ్ కార్మికులకు ఆపదలో ఉన్న వారిని తనవంతు సాయం అందజేస్తున్నారు. కోటపాటి నర్సింహనాయుడు సహకారంతో గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పిస్తున్నందుకు గాను బాజిరెడ్డి గోవర్ధన్, వీజీగౌడ్ లు బాలకిషన్ ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైలారం రమేష్, సాయికుమార్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:57PM