నవ తెలంగాణ-కంటేశ్వర్
మధ్యాహ్న భోజన పథకం కింద నేటి నుండి కోడిగుడ్డును అందించలేమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు నూరు చక్రపాణి మాట్లాడుతూ.. ముఖ్యంగా నేటి నుండి కోడిగుడ్డు అందించలేమని చెప్పి డీఈఓ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు సరఫరా చేయాలని ఉన్న ప్రభుత్వం పట్టించుకోకుండా బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు ముఖ్యంగా కోడిగుడ్డుకు ప్రభుత్వం ఐదు రూపాయల కేటాయించింది గ్రామాల్లో 7 రూపాయలకు అమ్ముతున్నారు. మరి మిగతా రెండు రూపాయలు కార్మికులే భరిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో స్లాబ్ రేటు సరిపోకుండా ఇవ్వడం మూలంగా కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తా ఉన్నది ఇది సరి అయింది కాదు . ప్రభుత్వం బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి కార్మికులను మోసం చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ సమస్యల మీద పరిష్కరించకుంటే రాబోయే కాలంలో ఆందోళన ఉధృతం చేస్తామని అదేవిధంగా జనవరి నుండి అవసరమస్తే సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, సుజాత నాగలక్ష్మి సాయమ్మ అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు కార్మికులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:59PM