నవతెలంగగాణ - అశ్వారావుపేట
ఓ పేద ఇంటి ఆడ బిడ్డ తన ప్రతిభతో ఓ కార్పోరేట్ ప్రైవేట్ ఆన్ లైన్ విద్యా సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో 4వ, ర్యాంక్ పొంది,ఆ సంస్థ అందజేసే ఉపకార వేతనానికి ఎంపికైంది.దీంతో మూడేళ్ళ పాటు చదివే డిగ్రీ విద్యతో పాటు సివిల్స్ కు కోచింగ్ కు సంస్థ తోడ్పాటు కు నెల నెలా రూ.8500 లు ఉపకారవేతనం అందనుంది. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ కె.లిల్లీ సుజన్ శారా బుధవారం తెలిపిన వివరాలు ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూరు కు చెందిన ఎం.డి నజియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట లో గల అల్పసంఖ్యాక గురుకులాల విద్యాసంస్థలకు చెందిన బాలికలు జూనియర్ కళాశాలలో బై.పీ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజియా గత నెల 23 న బి.ఎన్.ఎస్.టి బిజూస్ సంస్థ జాతీయ స్థాయీ లో సివిల్స్ కేటగిరిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించింది.ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ శారా బుధవారం పత్రికలకు విడుదల చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:01PM