నవతెలంగాణ-ధర్మసాగర్
నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య బుధవారం మండలంలోని దేవుని గ్రామానికి చెందిన క్రీ.శే.బొడికల బాబు, ఇదే గ్రామానికి చెందిన కీ.శే.బుగ్గని కొమురయ్య, కేశవ నగర్ గ్రామానికి చెందిన కీ. శె. గంగారపు శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా వారి వారి కుటుంబాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఆదరించి,నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి నా షయశక్తులగా పార్టీలకు అతీతంగా అండగా ఉంటానని సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ మునిగేల రాజు, కర్ర సోమిరెడ్డి, సోంపల్లి కరుణాకర్, మునిగాల శోభ, అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిదులు , ముఖ్య నాయకులు , గ్రామస్తులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:02PM