నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ పోలిసులు ఇద్దరు ద్విచక్రవాహనాల దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు అని నిజామాబాద్ ఎసీపీ వేంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసిపి అరే వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. ఇద్దరు దొంగలు దొరికారని, సల్మాన్ అనే మరొక దొంగ పరారీలో ఉన్నారని అన్నారు. పట్టుబడిన వారి నుంచి ఐదు ద్విచక్రవాహనాలను స్వాధినం చేసుకున్నారని తెలిపారు. బుధవారం నిజామాబాద్ నగర ఆరవ టౌన్ ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో తన పోలీసు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనాన్ని నడుపుతూ బోధన్ వైపు వెల్లడాన్ని గమనించారు. పోలీసులు వారిని అనుమానాస్పదంగా వ్యవహరించారని, అడ్డుకున్నారు అని తెలిపారు. దాంతో వారిని అదుపులోకి విచారిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని ఆదిలాబాద్ జిల్లా సుందరయ్య నగర్ కు చెందిన సయ్యద్ అమేర్, మక్బుల్ లుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. మరో దొంగ ద్విచక్రవాహనం అభంగపట్నానికి చెందిన చిల్ల రమేశ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. వెంటనే బండి ఓనర్ సాయి కుమార్ కు సమాచారం అందించారు. దొంగలు ఈ బండితో పాటు మరో ఐదు వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. కాగా పోలీసులు ఆ 5 ద్విచక్ర వాహనాలను స్వాధీన స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ దొంగలను పట్టుకున్న ఆరవ టౌన్ ఎస్సై సాయుకుమార్ ను సౌత్ రూరల్ సర్కల్ సీఐ నరేశ్, పీఎస్ సిబ్బందిని ఎసీపీ అభినంధించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:08PM