నవతెలంగాణ-డిచ్ పల్లి
మండలం ఖిల్లాడిచ్పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల్లో భాగంగా నూతనంగా పేద ప్రజల కోసం ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో, పల్లె పల్లెకు ప్రభుత్వ దవాఖానా నిత్యం, ఎల్లవేళలా అందుబాటులో ఎంబిబిఎస్ డాక్టర్లను నియమించినట్లు డాక్టర్ హెచ్ సుప్రియ అన్నారు. గ్రామపంచాయతీ పక్కనే ఉన్నా గదిలో పల్లె దవఖాన ఏర్పాటు చేసి వివిధ రోగాలు సోకిన రోగులకు వైద్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈసందర్బంగా బుధవారం మొదటి రోజు డాక్టర్.హెచ్. సుప్రియ పరిక్షలను నిర్వహించి మాట్లాడుతు గ్రామంలోని కొందరు మహిళలకు వివిధ రకాల వైద్యం చేసి ఉచితంగా మందులు అందించమన్నారు. ఎవరికి ఎలాంటి జ్వరం, కీళ్ల నొప్పులు, దగ్గు, సర్ది లాంటి వ్యాధులు సోకితే పల్లె దవాఖనకు వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకోవాలని సూచించారు. గర్భవతులు ప్రధమ చికిత్స కోసం మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ఆసుపత్రికి పంపించి సాధారణ కాన్పు చేసే ప్రయత్నం చేస్తారని తెలిపారు. సదరణ ప్రసవం సాధ్యం కానీ పక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ప్రసవం చేయడం జరుగుతుందని అమే వివరించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రభుత్వ దవాఖానా పథకాన్ని ఏర్పాటు చేసిందని, దీనికి ఎంబిబిఎస్ చదివిన అనుభవమైన వైద్యులతో చికిత్సలు అందిస్తున్న రని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలోకి వెళ్లి వైద్యం పొందాలని డాక్టర్ .హెచ్. సుప్రియ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, వేదవతి, శోభ, లక్ష్మి, లలిత రాథోడ్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:13PM