నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు నిజామాబాద్ లో జరిగిన 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రేస్ పోటీల్లో పాల్గొనగా రుచిత, చరణ్యలకు చెందిన ప్రాజెక్టు జిల్లాస్థాయి బహుమతి పొందినట్లు వీరికి గైడ్ గా వ్యవహరించిన భౌతిక, రసాయన ఉపాద్యాయులు రాజశేఖర్ తెలిపారు. విద్యార్థులు బహుమతి గెలుపొందడంతో వీరిని ప్రధానోపాధ్యాయులు మునిరోద్దీన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీధర్ విద్యార్థులకు 500 రూపాయల నగదు బహుమతి అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm