నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మొహమ్మద్ సాజిదా బేగంకు రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహాయాన్ని చేసి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల విప్ ను కలిసిన సాజిదా బేగం ఆమె గోడును విప్ ముందు వెళ్ళబోసుకున్నారు. ఆమె పరిస్థితిని చూసి చలించిన విప్ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆర్థిక సహాయాన్ని సాజిదా బేగంకు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెష్ మంజుల మల్లారెడ్డి, ఆర్ఎస్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అమరావతి సిద్ధిరామిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, మల్లేష్ మల్లారెడ్డి, విండో వైస్ చైర్మన్ మద్ది స్వామి, ఉప సర్పంచ్ రామగల్ల బిక్షపతి, తెరాస గ్రామ అధ్యక్షులు నాయకులు కర్నాల మల్లేశం, చిన్నమద్ది సిద్ధిరాములు, కాసాల బాలా గౌడ్, గొల్ల మల్లేశం, మహమ్మద్ హఫీస్, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:17PM