నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాద బీమా కార్డులను పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు కొమురయ్య, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ మంద నర్సింలు, శ్రీనివాస్, నర్సారెడ్డి,ధర్మయ్య, సిద్ధ రాములు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm