నవతెలంగాణ-డిచ్ పల్లి
బుధవారం ఉదయం నుండి యూనివర్సిటీ గ్రౌండ్ లో కబడ్డీ (మహిళా ,పురుషుల ) జట్లను ఎంపికలు నిర్వహించిన్నట్లు వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్.టి.సంపత్ తెలిపారు. పై సెలక్షన్స్ కొరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారని, మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు. పురుషుల విభాగం 14 కళాశాలల 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సెలక్షన్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్.ఆరతి, వర్శిటీ కబడ్డీ జట్టు ఎంపికలో పాల్గొని ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలియజేస్తూ ,క్రీడలు వ్యక్తి యొక్క అల్ రౌండ్ డెమాలప్మెంట్ కు చాలా ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు ప్రతి రోజు తమకు నచ్చిన ఆటలు ప్రాక్టీస్ చేయాలనీ, కబడ్డీ క్రిడా గ్రామీణ క్రిడా అని మన తెలంగాణ యూనివర్సిటీలో సెలక్షన్స్ ను నిర్వహించడం చాల అభినందనీయమన్నారు. క్రిడా విభాగం ఇంకా అనేక క్రీడలను కూడా నిర్వహించాలని ,మంచి క్రిడా కారులను యూనివర్సిటీ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ సెలక్షన్ కి అనుమతించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ బీ . విద్యవర్ధిని లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. పై సెలక్షన్ ను ఘనంగా నిర్వహిస్తునందుకు వర్శిటీ క్రిడా విభాగం సహాయ సిబ్బంది ని అభినందించారు.ఈ సెలక్షన్ లో జి.జి కళాశాల పీ .డీ బాలమణి ,జిడీ సి ఎల్లారెడ్డి స్పోర్ట్స్ ఇంచార్జి కృష్ణ ప్రసాద్ ,వెంకటేశం ,స్వప్న ,అశ్విని, వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బీ.ఆర్ నేత, రమేష్, రాహుల్, యశ్వంత్, రాజు క్రిడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:22PM