నవతెలంగాణ-భిక్కనూర్
కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం ఐక్యూఏసి, టీఎస్కేసి ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల పట్ల అవగాహన సదస్సు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ "విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ ఉద్యోగాలు సాధించడం కష్టమైన విషయం కాదు. సిలబస్ ను అధ్యయనం చేసి ఆయా అంశాలకు నిర్దిష్టమైన సమయం కేటాయించుకొని ప్రామాణికమైన పుస్తకాలు చదవాలి. ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యం పట్ల చిత్తశుద్ధితో చదివితే ఎంతో ప్రాధాన్యత గల సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించవచ్చు" అన్నారు.ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కిష్టయ్య మాట్లాడుతూ "విద్యార్థులకు వివిధ రకాల పొట్టి పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తూ, సంబంధిత అంశాలకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతున్నాము. వాటిని వినియోగించుకొని ఉన్నత స్థానానికి ఎదగాలి" అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం. చంద్రకాంత్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఈ. రాజ్ కుమార్, ఐక్యూ ఎ సి సమన్వయకర్త డాక్టర్ పి. రామకృష్ణ, టి ఎస్ కే సి సమన్వయకర్త ఫర్హీన్ ఫాతిమా, అధ్యాపకులు ఎ. రాణి, డాక్టర్ వి. శంకర్, డాక్టర్ కే. గణేశ్, జె. శివకుమార్, లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.రామస్వామి, డాక్టర్ కృష్ణ మోహన్, డాక్టర్ జ్యోత్స్న, ఎన్. రాములు, డాక్టర్ జి. శ్రీనివాస రావు, లక్ష్మణా చారి, డాక్టర్ పి. రాజగంభీర్ రావు. సుచరణ్, చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ చంద్ర శేఖర్, శ్రీనివాస్, మాల్సూర్, శ్రీలత, అనిల్ కృష్ణ, స్వాతి, అజారుద్దీన్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:23PM