నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని, ధరణి పోర్టల్ కేసీఆర్ తొత్తు అని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో చెరుకు శ్రీనివాస్ రైతన్నల సమస్యల పరిష్కారంకై బుధవారం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతులు, పార్టీ నాయకులు ఆయనకు దీక్ష స్థలిలో పూలమాల సంఘీభావం తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయం కాలం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం ఎంత సేపు ఢిల్లీలో పార్టీ పెట్టి గద్దెనెక్కాలన్న దానిపై ఉన్న ధ్యాస, ఇక్కడి రైతాంగ సమస్యలపై లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతుల పక్ష పాతి అంటూ రైతన్నల సమస్యలను ఎందుకు పట్టించుకుంటలేరని ప్రశ్నించారు. రాష్ట్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ధరణి పోర్టల్ రద్దు, తక్షణమే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, గిరిజన రైతుల (పోడు భూముల) సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కారు ధరణి పోర్టల్ విధానం తీసుకొచ్చి రైతుల్ని నట్టేటముంచిందని విమర్శించారు. ఇక ధరణ పోర్టల్ పూర్తిగా కేసీఆర్ ఏజెన్సీ గా మారిందని దుయ్యబట్టారు.రైతన్నల సమస్యలు తొలగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒకటే మార్గమని ,ఏ పార్టీ వచ్చినా వారి స్వార్థ లాభలను చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు అనంతల శ్రీనివాస్ , ఆకుల భరత్, దుబ్బాక అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉషయ్యగారి రాజిరెడ్డి, పాతురి వెంకట స్వామి గౌడ్, మల్లేశం, బాసమధు, మంద శ్రీనివాస్, తదితరులున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 06:37PM