నవతెలంగాణ - అశ్వారావుపేట
ఎట్టకేలకు మెల్లమెల్లగా ప్రభుత్వ దవాఖానాలో స్పెషలిస్టులు వైద్యం అందుబాటులోకి వస్తుంది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది.ఇప్పటి వరకు ఒకరో ఇద్దరో ఎం.బి.బి.ఎస్ లతో ఆసుపత్రి నడుస్తుంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎం.పి.పి శ్రీరామమూర్తి నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట అభివృద్ది పై దృష్టి సారించడంతో సామాజిక ఆరోగ్య కేంద్రం పై పలుమార్లు మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అమాత్యులు ఆదేశాలతో కలెక్టర్ ప్రత్యేక కౄషితో డిసిహెచ్ఎస్ రవిబాబు ఈ ఆసుపత్రిలో వైద్యులను నియమించే పనిలో నిమగ్నం అయ్యారు.ఈ కారణంతో ఇప్పటికే ఆరుగురు ఎం.బి.బి.ఎస్ వైద్యులతో పాటు ఆసుపత్రి వైద్యాధికారిని గా డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ జయలక్ష్మి ని నియమించారు.ఇటీవల మరో స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలతను నియమించారు. వీరు బుధవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇరువురు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారు.వీరిని ఎం.పి.పి శ్రీరామమూర్తి సన్మానించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 07:18PM