నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకొని ఇంకా నుండి రోజు నిజామాబాద్ బస్టాండ్ నుండి యూనివర్సిటీ కి బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ నుండి నిజామాబాద్ వరకు ప్రత్యేక బస్సును వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, ఆర్టీసీ అధికారులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని లతో కలిసి అర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించి తెలంగాణ యూనివర్సిటీ ఖ్యాతిని మరింత పెంపొందించాలని అయన ఆకాంక్షించారు. యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం వేళలో బస్సు రాకపోకలు చెస్తుందని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలలో అధిక ఫిజుల వసూళ్లపై విద్యార్థులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకొని వచ్చారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ ను శాలువ, పులి బోకేతో సత్కరించారు.బస్సులో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, నాయకులతో కుర్చుండి కోరుతోంది దురు వారకు ప్రయనించారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సంబరి మోహన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ,దాసరి లక్ష్మి నర్సయ్య, ఎంపిటిసి సాయిలు, సర్పంచులు మోహన్ రెడ్డి, తిరుపతి, నడ్పన్న, నాయకులు రాజశేఖర్, చాకలి సాయిలు, బుద్ధి సాయిలు, విజిల్ బోస్, మోహమ్మద్ యూసుఫ్, నాందేవ్, యూత్ రూరల్ అధ్యక్షులు షేక్ అమిర్, ఒడ్డం నర్సయ్య, తో పాటు నాయకులు, అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 07:25PM