నవతెలంగాణ-భిక్కనూర్
ఇండ్ల నిర్మాణానికి కుటుంబానికి మూడు లక్షలు ఇవ్వాలని ప్రముఖ న్యాయవాధిక్యాతం సిద్ధ రాములు అన్నారు. మండలం జంగంపల్లి గ్రామం మల్లు స్వరాజ్యం కాలనీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పేద ప్రజలు అక్కడ నివాసముంటున్న వారితో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, అనదికారులు ప్రభుత్వ గుర్తింపు లేని సంఘాలు మాకు ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షల రూపాయలు ఇచ్చి మల్లీ స్వరాజ్యం కాలనీలో పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనధి కారికంగా కాకుండా చట్టం ప్రకారం అధికారులు పనిచేయాలని, లేకపోతే మీరు కోర్టుల్లో జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక్కడ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన పోరాటాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, రాజ్యాంగంలో కూడు గూడు నీడ కల్పించాలని ఉందని, ప్రభుత్వాలు వీటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భూమి సాధించుకునేంతవరకు పేద ప్రజలు చైతన్యవంతంతో పోరాటం చేయాలని, గ్రామస్తుల బెదిరింపులకు త్వరలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, భూసాధన సమితి సభ్యులు దేవరాజ్, అర్జున్, బాలయ్య, లక్ష్మీ నరసవ్వ, సావిత్రి, మాడుగుల కవిత, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 07:28PM