నవతెలంగాణ-డిచ్ పల్లి
పొట్ట భూమిలోని హద్దులను ధ్వంసం చేస్తూ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ వాయి రెవెన్యూ శివారులోని 270 సర్వే నెంబర్ లోని తిర్మన్ పల్లి గ్రామ సమీపన మూడు ఎకరాల 20 గుంటల భూమి లింగాగౌడ్ కుమారుడు నర్సాగౌడ్, పెద్ద లింగ గౌడ్, ఉష గౌడ్, రాజా గౌడ్, కుమారులు శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,రాజుగౌడ్ వద్ద కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిలో బోరు వేసి చుట్టు ఫేన్సింగ్ కూడా వేయడం జరిగిందన్నారు. 22అక్టోబర్2020న సాదాబైనా కు దరఖాస్తు చేసినామని,కాని ఇంతవరకు నా పేరు పై పట్టా కాలేదన్నారు. 270 సర్వే నెంబర్లో అబ్దుల్ సత్తార్ తిర్మన్ పల్లి కు4 ఎకరల పట్టు భూమి ఉందని, వాళ్ళ భూమిని వారు చేసుకుంటున్న నా భూమి ఖాళీగా ఉందని, కాబట్టి అబ్దుల్ సత్తార్ కుమారులు చాంద్ పాషా, హైమద్, రజాక్ వారికి గాల పట్ట భూమిని ఆధారంగా చూపిస్తూ నేను కోనుగోలు చేసిన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నేను వేసుకున్న హద్దులను ధ్వంసం చేస్తూ ఫెన్సింగ్ చేర్పిస్తున్నారని ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి నా భూమి నుండి రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారన్నరు. కావున వారిపై చర్యలు తీసుకోవాని పట్ట భూమి నా పేరుపై చేయాలని ఇచ్చిన వినతి పత్రం లో విన్నవించారు. 22 అక్టోబర్ 2020 న సదబైనమకు దరఖాస్తు చేయడం జరిగిందని, అనాడు రాసుకున్న సెల్ అగ్రిమెంట్ పత్రం తన వద్ద ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 08:18PM