నవతెలంగాణ-డిచ్ పల్లి
రసాయన శాస్త్ర విద్యార్ధులు ప్రయోగశాలలో కొత్త ఆవిష్కరణలు చేయాలని, స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులు బాధ్యతారహితంగా మెలగాలని, అనాలసిస్ అనగా ఏ విషయం ఎందుకు జరుగుతున్నది అనే విషయంపై అవగాహన పెంపొందించుకోవాలని బాసర త్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బయోఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ అనే అంశంపై రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు బుధవారం ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమానికి బాసర త్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ, టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాసర త్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ రసాయన శాస్త్ర విద్యార్ధులు ప్రయోగశాలలో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులు బాధ్యతా రహితంగా మెలగాలని సూచించారు. అనాలసిస్ అనగా ఏ విషయం ఎందుకు జరుగుతున్నదనే విషయంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రసాయన శాస్త్రంలో తక్కువ మోతాదు మందుల ద్వారా రోగాలను నయం చేసే ఔషదాల ఆవిష్కరణ జరగాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ రసాయన శాస్త్రంలో విద్యార్థులు ఒక కొత్త మార్పును తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని, ఆధ్యాపకులు డాక్టర్ బాలకిషన్, డాక్టర్ సాయిలు, నాగరాజు, రాజేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 08:30PM