నవతెలంగాణ-వీణవంక
వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో బావు శ్రీనివాస్ యాదవ్ కు చెందిన మేకల మంద పై ఊరకుక్కలు దాడి చేయగా మేకలు మృతి చెందాయి. ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యం వలన గ్రామంలో 20 కుక్కలు మేకలపై దాడి చేశాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బావు శ్రీనివాస్ కు చెందిన మేకలు మృతి చెందగా ఉపాధి కోల్పోయామని కుటుంబీకులు రోదిస్తున్నారు. ఈ ఘటనలో దాదాపుగా లక్ష రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm