నవతెలంగాణ-రాజంపేట్
రైతులందరూ పంట వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జోష్నా ప్రియదర్శిని గురువారం పేర్కొన్నారు. ఆర్గొండ శివారులో సాగు చేస్తున్న వ్యవసాయ పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించడం జరిగింది. పంట నమోదు వివరాల సేకరణ పర్యవేక్షించారు. ముఖ్యంగా పంట నమోదులో వ్యవసాయ విస్తరణ అధికారులు పాటించాల్సిన మెలకువల గురించి సవివరంగా చెప్పడం అయినది. రైతులు వారు వేసిన పంటల్ని సర్వే నంబర్ ఆధారంగా ప్రతి గుంటలో పంటను నమోదు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ రైతులు వేసిన పంట, వేసిన రకం, నీటిపారుదల సౌకర్యం, పంట విత్తిన వారం, సాగు పద్దతి తగు సమాచారం విస్తరణ అధికారికి చెప్పాలి అని అన్నారు.
మొక్కజొన్న, శనగ , ఫ్రెంచ్ చిక్కుడు ( రాజ్ మా) పంటలలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు చీడ పీడల నివారణలో మెళకువల గురించి రైతులకు వివరించడం అయినది ,అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ యాసంగి పంట కాలంలో చేపడుతున్న క్షేత్ర స్థాయి ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. అందులో ముఖ్యంగా శనగ పంటలో ట్రైకోడర్మా విరిడి యెక్క ఆవశ్యకత , దఫా దఫాలుగా వివిధ పంటలలో ఎరువుల వినియోగం, వరి పంటలో భాస్వరన్ని కరిగించే బ్యాక్టీరియా గురించి రైతులతో చర్చించడం జరిగింది. శనగ పంటలో ట్రైకోడర్మా విరిడి యెక్క వాడకం మరియు ఎండు తెగుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటుందని చెప్పడం అయినది. కార్యక్రమంలో గ్రామ రైతులు , రాజంపేట మండల వ్యవసాయధికారిని జ్యోత్న్స ప్రియదర్శిని , వ్యవసాయ విస్తరణ అధికారులు శిల్ప మరియు శ్రీకాంత్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 07:41PM