నవతెలంగాణ-రాజంపేట్
రాజంపేట మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిసి, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఎన్ ఎస్ యు ఐ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దానికోసం మేమందరం తీవ్రంగా కష్టపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కే బాలకిషన్ కె.విరన్న ఆరేపల్లి సర్పంచ్ కొమ్ము యాదగిరి,పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్, మండల యువజన అధ్యక్షులుఅంకం కృష్ణారావు, సొసైటీ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, శివకుమార్, రాములు, వజహత్ అలీ వార్డు సభ్యులు ఇమ్రాన్ అలీ, జమిల్ మమ్మద్ షాదల్, గ్యార బాలరాజ్, భీమయ్య, సిద్ధిరాములు, గాలి వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 08:10PM