నవతెలంగాణ-వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ శ్రావణ్ కుమార్ గత నెల 25న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య తో పాటు భార్య కుటుంబ సభ్యుల మనోవేదనకు గురి చేయడం వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి నల్లగోని అయోధ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm