- వృద్దులకు ఉచిత పరీక్షలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
స్థానిక అమ్మ సేవ సదనం వృద్ధాశ్రమంలో భద్రాచలం రోడ్, సంత మార్కెట్ ఎదురుగా గల జీవన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఆద్వర్యంలో గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఇందులో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎ.పూర్ణ చంద్ వృద్ధులను పరీక్షించి సీతా కాలంలో సంక్రమించే వ్యాధులు పై అవగాహన కల్పించి, వృద్ధులకు వయస్సు రీత్యా వచ్చే తరుణ వ్యాధులకు మందులు అందజేసారు. అనంతరం సోషల్ హెల్త్ కేర్ సర్వీస్ సొసైటి సౌజన్యంతో అన్నదాన నిర్వహించారు. వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.పి.పి జె.శ్రీరామమూర్తి, ఎస్.ఐ ఎ సాయి కిషోర్ రెడ్డి, సోషల్ హెల్త్ కేర్ సర్వీస్ సొసైటి వ్యవస్థాపకులు రావూరి రాజు, కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి కామేష్, అశ్వారావుపేట మండల లీడర్ వి.లాల్ కుమార్, దమ్మపేట మండల లీడర్ అలివేలు, గ్రామ ఇంఛార్జి లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 08:16PM