- పాల్గొన్న డిగ్రీ విద్యార్థినిలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని గురువారం మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్ట్ లో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ర్యాలీ నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ రోజా నేతృత్వంలో, ఎన్.ఎస్.ఎస్ కో - ఆర్డినేటర్ డాక్టర్ జయ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేసారు. కళాశాల నుండి గమ్మడవల్లి వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ హరీష్, సిబ్బంది, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm