నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అప్పుల బాధతో బాత్రూంలో ఉరివేసుకొని మృతి చెందాడని నిజామాబాద్ మూడో పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ గురువారం తెలిపారు. ఎస్ ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్ర నుండి బతుకు తెరువు కోసం మాధవ్ నారాయణ్ వయస్సు 41 సంవత్సరాలు వచ్చి నివసిస్తున్నాడు. ఆదర్శనగర్ లో శ్రీ శక్తి ఆపరేట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ తన కుటుంబ సభ్యులని తన నాలుగురు ఆడ పిల్లలని పోషించలేక అప్పుల బాధ తో బుధవారం అనగా తేదీ 30.11.2022 రోజున మధ్యాహ్నం 3 గంటలకి బాత్రూం లో ఉరి వేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మూడవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్సషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 08:30PM